Jagitial | సారంగాపూర్, మే 18 : వర్షాలు రాకముందే మొక్కలు నాటేందుకు గుంతలు ఏర్పాటు చేయాలని జగిత్యాల డీఆర్డీవో రఘువరణ్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రం శివారు ఆటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు కూలీలతో గుంతలను ఏర్పాటు చేస్తుండడంతో వాటిని డీఆర్డిఓ సోమవారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. వర్షాలు ప్రారంభం కాకముందే గుంతలను ఏర్పాటు చేసి పెట్టుకోవాలని వర్షాలు పడడంతోనే మొక్కల ఫిట్టింగ్ చేపట్టవచ్చని సూచించారు. వర్షాలు పడితే వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయని అప్పుడు కూలీలు దొరకడం ఇబ్బంది అవుతుందని, ఇప్పుడే త్వరగా పూర్తి చేయాలన్నారు.
అనంతరం మండలంలోని రేచపల్లి, లచ్చనాయక్ తండా తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనికీలు చేసి వివరాలు తెల్సుకున్నారు. ఈ సందర్భంగా ఆయా సెంటర్లలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, మిల్లులకు తరలించిన ధాన్యం, గన్నిసంచులు, ఎంత మంది రైతులు ధాన్యం విక్రయించారు తదితర వివరాలను తెల్సుకున్నారు. కొనుగోళ్లలో జాప్యం చేయకుండా ధాన్యం వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని, డాటా ఎంట్రి పూర్తి చేయాలన్నారు. ఆకాల వర్షాలకు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ ఎండి సలీం, సర్పంచ్ బాస మహేష్, ఏపీఎం చంద్రకళ, ఏపీఓ శ్రీలత, కార్యదర్శులు సంతోష్ కుమార్, హేమలత, జీపీఓ మల్లేశం, సీసీ ప్రభాకర్, సెంటర్ల నిర్వహకులు, రైతులు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.