Ramagiri | రామగిరి, ఏప్రిల్ 17 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చేస్తున్న పీరియాడిక్ సర్వేలో భాగంగా ఆదివారంపేట, రాజాపూర్ గ్రామంలో గణాంక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జాతీయ గణాంక శాఖ 2026వ సంవత్సరానికి గాను ప్రజల ఉపాధి స్థితిగతులపై పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహిస్తున్నమన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలను ఎంపిక చేసుకుని ప్రజల ఉపాధి స్థితిగతులపై మొదట సాధారణ వివరాలతో సర్వే చేస్తామన్నారు.
అనంతరం మొబైల్ ట్యాబ్ ద్వారా గ్రామంలోని కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి మూడు నెలల పాటు నెలకు ఒకసారి పూర్తి సర్వే చేసి ప్రత్యేక ట్యాబ్లో వివరాలు నమోదు చేస్తామని తెలిపారు. తొలి విడతలో కుటుంబ యజమాని పేరు,సభ్యులు వారి విద్యా అర్హతలు, చదువు మానేసిన, ఉన్నత చదువులు, వృత్తివిద్య కోర్సులు, ఉద్యోగం, స్వయం ఉపాధి, వివరాలు రోజువారి కూలీ అయితే వారంలో ఏ పని చేశారో, ఎన్ని గంటలు పని చేశారో, ఎంత వేతనం పొందారో వివరాలతో పాటు మహిళలు స్వయం ఉపాధి పొందే వారయితే వారి ఆదాయ వివరాలను కూడా నమోదు చేస్తామని తెలిపారు.