Peraka Sangam | తిమ్మాపూర్, జనవరి 15 : తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లె గ్రామంలోని పురగిరి క్షత్రియ పెరక సంఘం 2026 క్యాలెండర్ ను అధ్యక్షుడు పాలేటి జనార్ధన్ తో కలిసి సర్పంచ్ గాండ్ల శ్రీనివాస్ ఆవిష్కరించారు. మక్తపల్లి లోని పంచముఖ హనుమాన్ ఆలయంలో మొదటగా ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం కమిటీ సభ్యులతో కలిసి క్యాలెండర్ ఆవిష్కరించారు. పెరుక సంఘం అభివృద్ధి, బలోపేతానికి తనవంతంగా కృషి చేస్తానని సర్పంచ్ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పాలేటి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు బొట్టు సదానందం, కోశాధికారి చింతం లక్ష్మణ్, డైరెక్టర్లు దాసరి రాములు, చింతం తిరుపతి, పాలేటి హరీష్, బొట్టు వెంకటేష్ తదితరులు ఉన్నారు.