Yellampally | అంతర్గాం, ఆగస్టు 16: అధిక వర్షాల తో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరద నీరు చేరడం, కడెం ప్రాజెక్టు నుండి వరద నీటి వల్ల గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి వదలడం మూలంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు గెట్లు ఎత్తి నీళ్లు కిందకు వదిలే అవకాశం ఉందని ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏఈ బుచ్చిబాబు తెలిపారు.
ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చేపలు పట్టేవారు, పశువులు, గొర్రెలు కాసేవారు, రైతులు ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీప ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని కోరారు.