Saraswati Pushkaraalu | ముత్తారం, మే 24; కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ అంతర్వాహిని నదీ పుష్కరాలకు ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ఉచితంగా ఏర్పాటు చేసిన బస్సులలో ముత్తారం మండలలోని వివిధ గ్రామాల ప్రజలు తరలివెళ్లారు. వారికి దారిలో మంత్రి ఆదేశాల మేరకు లడ్డు ప్రసాదాలను మండల మాజీ జెడ్పీటీసీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు వాజిద్ పాషా, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కతట్ల వినీత్ అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ఎంపిటిసిలు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.