తిమ్మాపూర్,ఏప్రిల్01: మిషన్ భగీరథ అధికారుల తీరుతో రామకృష్ణకాలానీ అనుబంధ గ్రామం సుభాష్ నగర్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. సుభాష్ నగర్ శివారులో ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్ నుండి వివిధ ప్రాంతాలకు నీళ్లు పైపుల ద్వారా తరలిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు, మూడు నెలల కింద సుభాష్ నగర్ స్టేజీ సమీపంలో పైప్ లైన్ లీక్ అవడంతో మిషన్ భగీరథ అధికారులు స్పందించి మరమ్మతుల కోసం గుంత తవ్వారు.
మరమ్మతులు దేవుడెరుగు.. ఆ గుంత తవ్వినప్పటి నుంచి అలాగే ఉన్నది. మరమ్మతులు చేయరు.. గుంత పూడ్చరు అన్న చందంగా తయారయింది అధికారుల తీరు. ఆ తవ్విన గుంత నుండి సైతం నీళ్లు పారుతూ దారంతా పాడైతున్నది. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.