Jagityal BSNL | జగిత్యాల, ఏప్రిల్ 03 : కేంద్ర ప్రభుత్వ పెన్షన్ వ్యతిరేఖ విధానాలను వ్యతిరేకంగా BSNL కార్యాలయం ముందు రిటైర్డ్ పెన్షనర్ ఉద్యోగులు గురువారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్ లో ఆమోదించబడ్డ పెన్షనర్ల సవరణ బిల్లుతో పెన్షనర్లకు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమాదకరమన్నారు.
దాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించు కోవాలని జగిత్యాల లో బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ రిటైర్డ్ ఉద్యోగులుగా డిమాండ్ చేస్తున్నామన్నారు. దేశ, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జెఎసి పిలుపు మేరకు బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్సేంజ్ ముందు నిరసన తెలుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా నాయకులు చిలుముల గంగారాం, ఎలుగండుల సుధాకర్, పురుషోత్తం, సాగర్, సైఫొద్దెన్ తదితరులు పాల్గొన్నారు.