జగిత్యాల : కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఆటో రిక్షా కార్మికులకు పెన్షన్ సౌకర్యం ( Pension facility ) కల్పించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ( Jeevan Reddy ) డిమాండ్ చేశారు. జగిత్యాల ఆటో యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ధ్యావర శ్రీనివాస్, కార్యదర్శి ఎండీ పాషా, సభ్యులు శుక్రవారం మాజీ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు .
ఆటో రిక్షా కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి 30 నెలలు గడుస్తున్నా ఇంతవరకు వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయలేకపోవడంతో ఆటో డ్రైవర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు . కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు.