కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష
సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని పెద్దపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి అభివర్ణించారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని చెప్పారు. ఓట్ల కోసం ఊళ్లకు వచ్చి మాయమాటలు చెప్పే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
- బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం
- ఓట్ల కోసం వచ్చే కాంగ్రెసోళ్లను నిలదీయండి
- పెద్దపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి
- బీఆర్ఎస్లో కాంగ్రెస్ నేతల చేరిక
పెద్దపల్లి, అక్టోబర్ 27: సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని పెద్దపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి అభివర్ణించారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని చెప్పారు. ఓట్ల కోసం ఊళ్లకు వచ్చి మాయమాటలు చెప్పే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సుల్తానాబా ద్ మండలం కందునూరిపల్లిలోని కాంగ్రెస్‌కు చెందిన బొజ్జ శ్రీనివాస్, బొజ్జ అనిల్, చొప్పరి జగన్, గొర్రె రాజేందర్, బొజ్జ మునీందర్, దాడి లింగయ్య,
మెండే శ్రీనివాస్, మెండే రవి, కందునూరి రాజేశం ఎలిగేడు మండలం ర్యాకల్దేవ్పల్లికి చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు మడ్లపల్లి నారాయణ, కాంగ్రెస్ వార్డు మెంబర్ దొనపాటి రాజిరెడ్డి, ఎడ్ల నారాయణ, నలిగేటి అనిల్, గోగు రాకేశ్, బొమ్మ కనుకయ్య, గోపు లక్ష్మిరెడ్డి, పాలేటి సంపత్, తీట్ల వెంకటయ్య, ఆసంపెల్లి బబ్లు, గుడికందుల అరవింద్, చింతిరెడ్డి రాజిరెడ్డి, మద్దెల రాజమల్లు, పెద్దపల్లిలోని బందంపల్లికి చెందిన మాదాసి రాజేంద్ర ప్రసాద్ బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే దాసరి పెద్దపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ 6 గ్యారెంటీలు కాదు.. 60 గ్యారెంటీలు ఇచ్చిన ప్రజలు నమ్మరని, ఆ పార్టీ ఎనాడో ప్రజావిశ్వాసం కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ నాయకులు మాటలు నీటి మూటలని, వాళ్లు ఇచ్చే అమలు కాని వాగ్దాదానాలను నమ్మి ఆగం కావద్దని, ఏ పార్టీ అభివృద్ధి చేసిందో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పన్నాల స్వరూప తిరుపతి, ఉప సర్పంచ్ పద్మ కొమురయ్య, నాయకులు కందునూరి ఓదెలు, భగవాన్, మామిడి కొమురయ్య ఈ కార్యక్రమంలో ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, సర్పంచ్ గోపు విజేందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నరేష్, నాయకులు గుడికందుల శంకర్, దుర్గం కమల్, గుడికందుల నవీన్ కౌన్సిలర్ ఈరబోయిన శ్రీనివాస్, దామోదరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గులాబీ గూటికి జై భీమ్ సభ్యులు
కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్27: గంగారం గ్రామ పరిధిలోని ఊశన్నపల్లె చెందిన జైభీమ్ యూత్ సభ్యులు శుక్రవారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. జీడి నరేశ్, జీడి అనిల్, జీడి హరీశ్, జీడి మధు, జీడి ప్రశాంత్, బండారు ప్రశాంత్, బం డారి శ్రీధర్, బండారి శ్రీనివాస్, బండారి రవి చందర్, శనిగరపు రాజ్‌కుమార్, బండారి శివ కుమార్, బండారి రంజిత్, జీడి అరవింద్, జీడి సాయికుమార్, బండారి రజినీకాంత్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

