ధర్మారం, అక్టోబర్ 15 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో ప్రపంచ ఆహార దినోత్సవ వేడుకలను గురువారం నిర్వహించారు. 6వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులందరు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా తమ ఇంటి దగ్గర తయారు చేసిన ప్రత్యేకంగా తెలంగాణ ఆహారపు పదార్థాలను పాఠశాలలో ప్రదర్శించారు.
ఇందులో భాగంగా విద్యార్థులు తయారు చేసిన మక్కగడ్క, జొన్నఅంబలి, గారెలు, సత్తు పిండి పదార్థాలు, గుడాలు, రాగి జావా, మిల్లెట్స్ మొదలగు తెలంగాణ ఆహారపు వంటకాలను ప్రదర్శించి ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ ఆహార పదార్థాలను తినడం వలన కలిగే ప్రయోజనాలను కూడా వారు వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.