Nandi Pump House | నంది పంప్‌హౌస్‌లో కొనసాగుతున్న నీటి ఎత్తిపోతలు
నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌లో ఆరు రోజులుగా నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.
ధర్మారం, మార్చి 3 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌లో ఆరు రోజులుగా నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సొరంగాల ద్వారా వచ్చిన నీటిని ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరదాకా నీటి పంపింగ్ కొనసాగించి ఆ తర్వాత నిలిపి వేస్తున్నారు. కాగా, బుధవారం 1, 7 నెంబర్ల మోటర్లను నడిపించి, 3,150 క్యూసెకుల చొప్పున 2 మోటార్ల ద్వారా 6,300 క్యూసెక్కుల జలాలను నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయించారు.
అయితే, బుధవారం ఎత్తిపోసిన నీటిని నంది రిజర్వాయర్‌కే పరిమితం చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్ కు వెళ్లకుండా రిజర్వాయర్ మెయిన్ గేట్లను మూసివేశారు. నంది రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 233 మీటర్లు కాగా 229 వరకు నీటిని నిల్వ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

