Elections | పెద్దపల్లి, ఏప్రిల్13: కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మాడూరి వినోద్ కుమార్ ఎన్నికయ్యారు. వినోద్ కుమార్ ప్యానల్ వరసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించింది. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్మక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పోస్టులకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు.
జిల్లాలో 552 ఓటర్లు ఉండగా, 514 ఓట్లు పోలయ్యాయి. కాగా అధ్యక్షుడిగా ఎం వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా గోదావరిఖని చెందిన కంజంపురం రాజేందర్, కోశాధికారిగా పోలు సతీష్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. దీంతో మాడూరు వినోద్‌కుమార్ ప్యానల్ హ్యాట్రిక్ విజయం సాధించటం పట్ల పలువురు శుభాకాంక్షలు తెలిపారు.