సుల్తానాబాద్ రూరల్ ఫిబ్రవరి 25: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం శ్రీవాణి కళాశాల లక్ష్యం (Srivani College)అని రేకులపల్లి విజయ ఉన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని నర్సయ్యపల్లి పరిధిలోని విజయ ఏసీ గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీవాణి కళాశాల సుల్తానాబాద్‌లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఎప్పుడు ముందుంటుందన్నారు. విద్యార్థులు కూడా రాబోయే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని సూచించారు.
ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల మాటలను పాటిస్తే అవి రాబోయే కాలంలో మన ఎదుగుదలకు దోహదపడతాయని పేర్కొన్నారు. 2023 -24 విద్యా సంవత్సరంలో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమానికి శ్రీవాణి కళాశాల, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలు, తదితరులు పాల్గొన్నారు.