పెద్దపల్లి : తెలంగాణలోని పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అదుపులోకి తీసుకున్న ముగ్గురు మావోయిస్టులను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(మావోయిస్టు) పార్టీ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి(Division Committe Secretary) పి వెంకటేష్ (Venkatesh) డిమాండ్ చేశారు.
ఈనెల 29న ఏటూరు నాగారం- మహదేవపూర్ దళంలోని నిరాయుధులైన జై సింగ్(Jaisingh) , రమేష్(Ramesh) లను, 30న సుక్కి(Sukki) ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పోలీసులు పట్టుకున్నారని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. ఈ ముగ్గురిని కనబడకుండా దాచిపెట్టి చిత్ర హింసలకు గురిచేస్తూ వారిని ఎన్ కౌంటర్(Encounter) పేరుతో చంపే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.
వారికి ఇలాంటి ప్రాణహాని తలపెట్టకుండా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని 24 గంటల్లో కోర్టుకు హాజరు పరచాలని, వారికి ఎలాంటి హాని జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక నాయకులే బాధ్యత వహించాలన్నారు. ఈ అరెస్టును ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలన్నారు.