Peddapally | పెద్దపల్లి టౌన్ జూన్ 6. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు నిర్వహించాలని, ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని అఖిలపక్షం, ప్రజా సంఘాల నాయకులు మాదన కుమారస్వామి ఎర్రవెల్లి ముత్యంరావు తాండ్ర సదానందం లు డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం నుండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒరిస్సా ఛతీస్ఘడ్ మహారాష్ట్ర సరిహద్దులోని దండకారణ్యం కర్రెగుట్ట లోని సహజ ఖనిజ సంపదను బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
దండకారణ్యంలోని ఆదివాసీలను అక్కడి నుండి తరిమి వేసేందుకు మావోయిస్టుల ఎరచూపి పారా మిలిటరీ బిఎస్ఎఫ్ వేలాదిమంది పోలీసు బలగాలతో భూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా నజరేముడి సర్కార్ దిగివచ్చి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగారును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ అఖిలపక్షం ప్రజాసంఘాల నాయకులు ఈర్ల నరేష్ ఎర్రవెల్లి ముత్యంరావు మాదన కుమారస్వామి తాండ్ర సాధానందం, గుమ్మడి కొమరయ్య బాలసాని రాజయ్య కల్లేపల్లి అశోక్ గాండ్ల మల్లేశం కాదాస్ మల్లేష్ రవీందర్ బాలకృష్ణ ఎరుకల రాజన్న రామిళ్ళ బాపు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.