పెద్దపల్లి : గోదావరిఖని సీనియర్ న్యాయవాది, సర్వోదయ నాయకుడు, ఉద్యమకారుడు గంట నారాయణ మంగళవారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గులాబీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ..కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మేధావులు, ఇతర పార్టీల ముఖ్య కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు.
రామగుండం ప్రాంతం అభివృద్ది పథంలో నడవాలంటే అనుభవజ్ఞులైన విద్యావంతులు కావాలని, వారి ఆలోచనలు, సూచనలతో రామగుండాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్‌కుమార్, కార్పొరేటర్ బాలరాజ్‌కుమార్, నాయకులు జేవి.రాజు, మేకల పోశం, దేవి, పోలంపల్లి సదానందం తదితరులున్నారు.