సుల్తానాబాద్ రూరల్ జనవరి 13 : సంస్కృతి, సంప్రదాయాలకు ముగ్గుల పోటీలు ప్రతిబింబం మనీ కనుకుల సర్పంచ్ కర్రె కవిత అన్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ గ్రోమోర్, శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీల నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు బహుమతులను ప్రధానం చేశారు.
ఈ ముగ్గుల పోటీలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కనుకుల సర్పంచ్ కర్రె కవిత కుమారస్వామి, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ పెద్దపల్లి జిల్లామేనేజర్ కె రాహుల్ కుమార్, డిస్టిక్ అగ్రనమిస్టు విష్ణు సాయి , మార్కెట్ డెవలపమెంట్ ట్రెయినీస్ దినేష్ ,రమేష్ , ఫెర్టిలైజర్ షాప్ యజమాని ఇల్లందుల శ్రీనివాస్ గౌడ్ , వార్డు సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు.