Bhogi | పెద్దపల్లి రూరల్, జనవరి 14: భోగి పండుగ అందరికీ భోగభాగ్యాలు కల్పించాలని, చెడును దూరం చేసి మంచిని ఆహ్వానించాలని కోరుతూ పెద్దపల్లి మండలం భోజన్నపేటలో భోగి మంటలు వెలిగించారు. బుధవారం భోగి పండుగ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు, వార్డు సభ్యుడు ఆవుల సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామంలో సంప్రదాయబద్ధంగా భోగి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కష్టజీవులుగా జీవనం సాగిస్తున్న ప్రజల జీవితాల్లో పాత కష్టాలన్నీ భోగి మంటల్లో కాలిపోవాలని, కొత్త ఆశలు, ఆనందాలు, సిరిసంపదలు ప్రతి ఇంటికి చేరాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ వర్ధిల్లాలని ప్రార్థించారు. భోగి మంటల వద్ద గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.