పెద్దపల్లి రూరల్, నవంబర్ 24: సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections) ఎప్పుడెప్పుడా అని ఎదిరిచూస్తున్న నాయకులకు, సర్పంచ్లు ఎప్పుడు వస్తారో మా బాధలు ఎప్పుడు పోతాయో అనుకునే పంచాయతీ కార్యదర్శులు, అధికారుల పనితీరుకు విసిగిపోయి ఆ సర్పంచులు ((Sarpanch) ఉంటేనే బాగుండు అని ఎదురుచూస్తున్న ప్రజలు కోరిక నెరవేరేలా రగ్గం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఎట్టకేలకు సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లను (Reservations) అధికారులు ఖరారు చేశారు. అనేక కసరత్తుల అనంతరం రిజర్వేషన్లను పాత పద్దతిలోనే ఎన్నికలు చేసుకోవాలన్న కోర్టు మార్గదర్శకాల ప్రకారం ముందుకుసాగుతున్నది యంత్రాంగం.. ఈ మేరకు గత వారం రోజులుగా జరిగిన కసరత్తులో
పెద్దపల్లి (Peddapalli) మండలంలో 8 స్థానాలు జనరల్, 7 జనరల్ మహిళ, 3 ఎస్సీ జనరల్, 3 ఎస్సీ మహిళ, 5 స్థానాలు బీసీ జనరల్, 4 స్థానాలు బీసీ మహిళలకు కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా అసలు ఎన్నికలు జరుగుతాయా.. లేదా అనే సందేహంలో ప్రజలు, నాయకులు ఉండడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఏది ఏమైనా
అధికారులు వెల్లడించిన ప్రకారం పెద్దపల్లి మండలంలోని 30 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి..
1) అందుగులపల్లి-ఎస్సీ జనరల్.
2) అప్పన్నపేట్-జనరల్
3) భోజన్నపేట-ఎస్సీ మహిళా
4) బొంపెల్లి-జనరల్ మహిళ
5) బ్రాహ్మణపల్లి-జనరల్ మహిళ
6) చీకురాయి-జనరల్
7) దేవునిపల్లి-బీసీ మహిళ
8) గోపయ్యపల్లి-జనరల్
9) గౌరెడ్డిపేట-బీసీ మహిళ
10) గుర్రంపల్లి-బీసీ జనరల్
11) హనుమంతునిపేట-బీసీ జనరల్
12) కనగర్తి-జనరల్ మహిళ
13) కాపులపల్లి-జనరల్
14) కాసులపల్లి-ఎస్సీ జనరల్
15) కొత్తపల్లి-ఎస్సీ మహిళ
16) కురుమపల్లి-బీసీ మహిళ
17) మారేడుకొండ-జనరల్ మహిళ
18) మూలసాల-ఎస్సీ మహిళ
19) ముత్తారం-బీసీ జనరల్
20) నిమ్మనపల్లి-జనరల్
21) నిట్టూర్-జనరల్ మహిళ
22) పాలితం-జనరల్
23) పెద్ద బొంకూర్-ఎస్సీ జనరల్
24) పెద్దకల్వల-బీసీ మహిళ
25) రాఘవపూర్-జనరల్ మహిళ
26) రాగినేడు-బీసీ జనరల్
27) రాంపల్లి-జనరల్
28) రంగాపూర్-జనరల్
29) సబితం-జనరల్ మహిళ
30) తురకల మద్దికుంట-బీసీ జనరల్