Rain : పెద్దపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం ఈదురుగాలులకు తోడు వర్షం కురవడంతో పలుచోట్లు రహదారిపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధర్మారం మండల కేంద్రంలో ఇంటి రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ధర్మారం మండల కేంద్రంలో గాలివాన జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఓదెల మండలంలో గాలివాన అందుకోవడం.. పలు గ్రామాల్లో కరెంటు నిలిచిపోయింది. గాలివాన కారణంగా ఎర్రగుంటపల్లి గ్రామం వద్ద కరీంనగర్ రాయపట్నం రహదారిపై మర్రి చెట్టు కూలిపోయింది. దాంతో, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ధర్మారం మండల కేంద్రంలో గాలి తీవ్రతకు బీఆర్ఎస్ నాయకుడు గాజుల రాజు ఇంటి రేకులు లేచి కింద పడ్డాయి. సమీపంలోని రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడగా.. తీగలు తెగిపడ్డాయి.
దాంతో, ధర్మారంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకటి అలుముకుంది.
గాలి తీవ్రతకు కిందపడిన ఇంటిపై కప్పు రేకులు
