కోల్సిటీ, జనవరి 4 : అమెరికా సామ్రాజ్యవాదం, యుద్ధోన్మాదం నశించాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వెనిజులా దేశ అధ్యక్షుడు నికోలాస్ మధురో, ఆయన భార్య సిలియా ఫ్లోరస్ లను అమెరికన్ సైన్యం అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఆదివారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అమెరికా నియంత పోకడలకు వ్యతిరేకంగా మిన్నటిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఐకృష్ణ, ఇ.నరేష్ మాట్లాడుతూ.. అమెరికా ఐక్య రాజ్యసమితి నియమాలను, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించిందన్నారు.
వెనిజులా దేశంలో ఆయిల్ సంపద, నిక్షేపాలను కొల్లగొట్టడానికి తప్పుడు ఆరోపణలతో ఆ దేశంపై దాడి చేసిన అమెరికా అహంకారం పద్ధతి కాదన్నారు. ఆ దేశ ప్రజల ప్రజాస్వామిక హక్కులపై అమెరికా దాడిగా పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు అశోక్, చిలుక శంకర్, రామకృష్ణ, రాజేశం, మల్లేశం, కొంరయ్య, ఐఎఫ్ టి యూ నాయకులు మొండయ్య, రాజేందర్, గుండ రాజయ్య, ప్రసాద్, ఎల్లయ్య, ధర్మేందర్, చంద్రయ్య, గడ్డి రాజు, అజయ్, కాంపెల్లి మల్లేశం, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.