ధర్మారం,ఆగస్టు 12: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పతంజలి యోగ సేవా సమితి సభ్యులు శ్రమదానం చేశారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సేవా సమితి, జంగిలి మంజుల సుధాకర్ నేతృత్వంలో స్థానిక ఆయుష్ కేంద్రం వద్ద స్వచ్ఛత కార్యక్రమాన్ని అభ్యాసకు లతో కలిసి చేపట్టారు.
పిచ్చి మొక్కలను తొలగించి, చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రపరిచారు.ఈ కార్యక్రమంలో యోగ అభ్యసకులు నాడెం శ్రీనివాస్, దేవి అంజయ్య, సత్యనారాయణ, భూమన్న, రాజమౌళి, మల్లేష్, రమేష్, పోశెట్టి, రాజు, సమ్మయ్య, వసంత, సుజాత తదితరులు పాల్గొన్నారు.