పాలకుర్తి : పాలకుర్తి మండలం గన్ శ్యామ్ దాస్ నగర్ కు చెందిన యువకుడు పొనగంటి శివకుమార్ (31) గుండెపోటుతో చనిపోయాడు. యువకుడి నేత్రాలు మట్టిపాలు కాకుండా నేత్రదానం చేయాలని భూపెల్లి సాగర్ నేత్రదానంపై శివకుమార్ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. దీనికి కుటుంబ సభ్యులు ఒప్పుకొని సదాశివ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేయడానికి అంగీకరించారు. దీంతో సదాశివ ఫౌండేషన్ పాలకుర్తి మండల అధ్యక్షుడు భీమనపల్లి పృథ్వీరాజ్ ఎల్విపి టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ కార్నియాలు సేకరించి హైదరాబాద్ ఐ బ్యాంకుకు పంపించారు.
చేతికందిన కుమారుడు గుండె పోటుతో మృతి చెందిన బాధలో ఉండి కూడా తన కుమారుడి ద్వారా మరో ఇద్దరు అంధులకు చూపు రావచ్చన్న పెద్ద మనసుతో ముందుకు వచ్చి తల్లిదండ్రులు పొన్నగంటి నారాయణ, విజయ, అన్న వదిన రఘునాథ్, శరణ్య, అక్క బావ మమత, తిరుపతిని సదాశయ ఫౌండేషన్ సభ్యులు ధన్యవాదములు తెలిపారు. మృతి చెందిన శివకుమార్ స్నేహితులు దేవి, సందీప్, పెరక కృష్ణ, అర్జున్ పాల్, కల్వల సంతోష్, జపాల అఖిల్, కొత్తూరి సురేష్ తదితరులకు సదాశివ ఫౌండేషన్ తరఫున అభినందనలు తెలిపారు.