సుల్తానాబాద్ రూరల్, సెప్టెంబర్ 06: వైభవంగా అనంత కోటి పద్మనాభస్వామి వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించారు. కోటి వత్తులతో ప్రత్యేక పూజలు. పెద్ద సంఖ్యలో దంపతులు పాల్గొని పూజలు చేశారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ (Sultanabad) మండలంలోని నీరుకుల్లా మానేటి రంగనాయక స్వామి ఆలయంలో అనంత కోటి పద్మనాభ స్వామి జన్మదిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మానేటి రంగనాయక స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం అనంత పద్మనాభ స్వామి వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే శనివారం దాదాపుగా 200 మంది దంపతులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు.
సుల్తానాబాద్ మండలం తో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వ్రతం, పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తుల కోసం ఉదయం అల్పాహారం సుల్తానాబాద్ కు చెందిన కొమురవెల్లి సుజాత సత్యం దంపతులు, మధ్యాహ్నం అన్నవితరణ రాజు కంటి హారిక భూమయ్యలు చేశారు. ఏర్పాట్లను ఈఓ శంకరయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోటగిరి విజేందర్ గౌడ్, అర్చకులు, గోవర్ధనగిరి జగన్నాథచార్యులు, గోవర్ధనగిరి వేణు మనోహరచార్యులు, గోవర్ధనగిరి శ్యామ్ సుందరాచార్యులు, భక్తులు గ్రామస్తులు తదితరున్నారు.