Road Accident | కాల్వ శ్రీరాంపూర్ మే 30 : కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం శివారులో ప్రధాన రహదారిపై ట్రాలీ ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో మండలంలోని కునారం గ్రామానికి చెందిన ఎండీ అక్రం (27) అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. అక్రం కాల్వ శ్రీరాంపుర్ మండల కేంద్రంలో ఆటో మెకానిక్ వర్క్ చేస్తుంటాడు.
శుక్రవారం పనులు ముగించుకొని తన ద్విచక్ర వాహనం ద్వారా తన స్వగ్రామమైన కూనారం వెళ్తుండగా గంగారం గ్రామ శివారులో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనానికి ఎదురుగా వస్తున్న ట్రాలీ ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఎండీ అక్రం తలకు చేతులకు గాయాలతో పాటు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. అక్రమ్ కు భార్య సమీరా బేగం, తల్లిదండ్రులు అక్బర్ రేష్మ బేగం లో ఉన్నారు.
మృతి చెందిన తన కొడుకుని చూసి రోదిస్తున్న తీరు పలువురు హృదయాలను కలిచి వేసింది. సంఘటన స్థలాన్ని ఎస్సై వెంకటేష్ పరిశీలించి మృతున్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ తరలించారు. ట్రాలీని పోలీస్ స్టేషన్ తరలించి రాలి నడుపుతున్న డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.