పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల క్యాంపు ఆవరణలో గల ఫంక్షన్ హాల్ లో పెద్దపల్లి జిల్లా పంచాయతీ కార్యదర్శుల( Panchayat Secretaries)ఫోరం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా దేవరనేని నిశాంత్ రావు, ప్రధాన కార్యదర్షిగా మహేందర్, అసోసియేట్ అధ్యక్షులుగా కృష్ణ, ఉమాపతి రెడ్డి, ఉపాధ్యక్షలుగా శరత్, భాను ప్రసాద్, సాగర్ రావు, శ్రవణ్, నరేష్, మసీయొద్దీన్, జాయింట్ సెక్రటరీ లుగా తిరుపతి, మౌనిక, అంజలి, సత్యనారాయణ రెడ్డి, సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజ్ కుమార్, కోశాధికారి గా మారుతి, ప్రచార కార్యదర్శిగా సోనియా, కల్చరల్ కార్యదర్శిగా లలిత ఎన్నికయ్యారు.
అలాగే ఈసీ మెంబర్స్‌గా జుహిబ్, కిరణ్ కుమార్, రవి, సతీష్, టి. రవి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలకు గాను తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ పోరం రాష్ట్ర అధ్యక్షులు సందిలా బలరాం, అసోసియేట్ అధ్యక్షులు శ్రవణ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు బొంకురి శంకర్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్బంగా నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలతో ఘనంగా సత్కరించారు.