పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 15 : రాజీవ్ యువ వికాసం పథకం ఫలాలను అర్హులైన వారికి దక్కేలా చూడాల్సిన బాధ్యత అధికారులుపై ఉందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నరేదర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటి వరకు దాదాపు 220 వరకు దరఖాస్తులు తమకు అందాయని ఎంపీడీవో తెలిపారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిబంధనల మేరకు లబ్దిదారులను ఎంపిక చేస్తామని ఎంపీడీవో సీఈవోకు వివరించారు. అర్హులను ఎంపిక చేయాలని ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే తుది నిర్ణయం తీసుకోవాలని సీఈవో నరేందర్ సూచించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటరమణ, తదితరులుపాల్గొన్నారు.