Students Creativity | జ్యోతినగర్, ఏప్రిల్ 28 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మే 1 నుంచి జూన్ 10వరకు జరిగే వేసవి శిక్షణ శిబిరంలో లెర్నింగ్ గ్యాప్ లేకుండా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలని జిల్లా విద్యాధికారి మాధవి పేర్కొన్నారు. ఇవాళ ఎన్టీపీసీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరంపై వాలంటీర్లకు జిల్లా రిసోర్స్ పర్సన్లు చేపట్టిన శిక్షణ కార్యక్రమానికి డీఈవో హజరై మాట్లాడారు.
వాలంటీర్లు ఆయా పాఠశాలల పరిధి గ్రామాల్లో డిగ్రీ చదువుకున్న అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలన్నారు. ఉదయం 8గంటల నుంచి 10.30 నిమిషాల వరకు వాలంటరీలు ఆటలు, డ్రాయింగ్, తెలుగు, ఆంగ్లం, లెక్కలు బోధిస్తారన్నారు. రామగుండం మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ పర్సన్లు రవి, సంపత్ రెడ్డి, అంతర్గాం, పాలకుర్తి మండలాల ఎంఈవోలు యాకంబరం, విమల, మూడు మండలాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సంగీత, కమలాకర్‌రావు, గాయత్రి దేవి, గోపి, భూమయ్య, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ రాము కుమార్, వెంకట్, శ్రీను, సతీశ్, శ్రీలత, గౌస్, జ్యోతి, వాణిశ్రీ, మూడు మండలాల నుంచి దాదాపు 80మంది వాలంటీర్లు పాల్గొన్నారు.
Migratory birds | పెరుంగులమ్ రిజర్వాయర్‌లో వలస పక్షుల సందడి.. Video
Mission Bhageeratha | మిషన్ భగీరథపై నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపే లేదు
PVNR Expressway | పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్