పెద్దపల్లి : సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల చల్లని చూపులు రామగుండం ప్రజానీకంపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవార్లను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరుకున్నారు.
శుక్రవారం మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే ఎత్తు బెల్లం మెుక్కులను చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, దేశానికి కేసీఆర్ గనాయకత్వం వహించేలా సమ్మక్క సారలమ్మ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే చందర్ కోరుకున్నారు.