కాల్వ శ్రీరాంపూర్ ఫిబ్రవరి 10 : ప్రతి బ్యాంకు ఖాతాదారుడు కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని కేడీసీసీబీ ఏటీఎం మీర్జా ఇంతియాజ్ అలీ బేగ్ అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ కేడీసీసీబీ బ్యాంకులో మంగళవారం పోస్టరు ఆవిష్కరించి మాట్లాడారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.
ఖాతా భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు బ్యాంకులో అందుబాటులో ఉన్న వివిధ పథకాలపై వివరించారు. ఈనెల 13న మోట్లపల్లిలో ఆర్థిక అక్షరాస్యత పై సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ కాల్వ శ్రీరాంపూర్ మేనేజర్ కరుణశ్రీ, ఫీల్డ్ ఆఫీసర్ రాజశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ అజ్మీల్ అలీ, సిబ్బంది ఖాతాదారులు ఉన్నారు.