భీమదేవరపల్లి, జనవరి 01: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గాంధీనగర్లో జనవరి 4వ తేదీ నుంచి మెగా క్రికెట్ టోర్నమెంట్ జరుగునుంది. టోర్నీకి సంబంధించిన కరపత్రాలను గురువారం విడుదల చేశామని నిర్వాహకులు తాళ్లపల్లి కుమారస్వామి తెలిపారు. తమ గ్రామంలో నిర్వహించనున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ కరపత్రాలను సర్పంచ్ కేతరి లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కేతరి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గంజాయి, ఆన్లైన్ గేమ్స్ వంటి వ్యసనాల మాయలో పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచి, వారిని చైతన్యవంతులను చేసిందుకే మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని సర్పంచ్ వెల్లడించారు. కాబట్టి యువత చురుకుగా ఈ టోర్నీలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తాళ్లపల్లి రమేష్, అశోక్, నిర్వహణ కమిటీ సభ్యులు తూముల అరవింద్, తాళ్లపల్లి ప్రసాద్, అరవింద్, విక్రమ్, ఉదయ్ కిరణ్, సంపత్, బిన్ను పాల్గొన్నారు