తిరుమల : 2025 సంవత్సరంలో శ్రీవారి లడ్డూ ( Tirumala Laddu ) ప్రసాదాలు రికార్డుస్థాయిలో విక్రయించారు. 2024వ సంవత్సరంతో పోల్చితే 10 శాతం అధికంగా లడ్డూలను భక్తులకు విక్రయించారు. గత ఏడాది 12.15 కోట్ల లడ్డూలను విక్రయించగా ఈ ఏడాది 13.52 కోట్ల లడ్డూలను టీటీడీ ( TTD ) విక్రయించింది. గత ఏడాదితో పోల్చితే 1.37 కోట్ల లడ్డూలను అదనంగా విక్రయించారు.
గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా 2025 డిసెంబర్ ( December) 27న అత్యధికంగా 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. టీటీడీ సంవత్సరకాలంగా ప్రతిరోజూ 4 లక్షల వరకూ లడ్డూలను తయారు చేస్తోంది. ముఖ్యమైన రోజుల్లో 8 లక్షల నుంచి 10 లక్షల లడ్డూల వరకు ( Buffer ) అందుబాటులో ఉంచుతోంది.