Alumni Meet | 15 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరిన పూర్వ విద్యార్థులు.. ఘనంగా మంథని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ ఆత్మీయ సమ్మేళనం
Alumni Meet | కాలం మారినా స్నేహబంధాలు చెదరవని మరోసారి నిరూపించారు పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పూర్వ విద్యార్థులు. డిగ్రీ పూర్తయిన దాదాపు 15 ఏళ్ల తర్వాత అందరూ ఆదివారం మళ్లీ కలుసుకుని ఆత్మీయంగా గడిపారు.
Alumni Meet | మంథని రూరల్, మే 25: కాలం మారినా స్నేహబంధాలు చెదరవని మరోసారి నిరూపించారు పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పూర్వ విద్యార్థులు. డిగ్రీ పూర్తయిన దాదాపు 15 ఏళ్ల తర్వాత అందరూ ఆదివారం మళ్లీ కలుసుకుని ఆత్మీయంగా గడిపారు. 2005-2008 బ్యాచ్ బీఏ, బీకాం పూర్వ విద్యార్థులు.. మంథని మండలం సూర్యపల్లెలోని బీఎస్ బ్యాంకెట్ హాలులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కాలేజీ రోజుల్లోని మధురానుభూతులు, స్నేహ బంధాలను గుర్తుచేసుకుంటూ సంతోషంగా గడిపారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కలుసుకోవడంతో పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అలాగే తమకు విద్యాబోధన చేసిన గురువులనున సన్మానించుకున్నారు. గురువులు అందించిన విద్య, మార్గదర్శకత్వం తమ జీవితాల్లో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. గురువుల కూడా విద్యార్థులతో గడిపిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

