ఫర్టిలైజర్ సిటీ : బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్ పై తప్పుడు కేసు నమోదు చేశారని, న్యాయవాదులను(Lawyers ) దూషించిన వ్యక్తులపై చర్య తీసుకోవాలని, న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమలు చేయాలని మంగళవారం ఖని న్యాయవాదులు చేస్తున్న చేస్తున్న దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ మేరకు మంగళవారం సైతం విధులు బహిష్కరించటంతో 3వ మున్సిఫ్ కోర్టులు, అదనపు జిల్లా న్యాయస్థానం, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులలో విధులు నిలిచి పోయాయి. అనంతరం మున్సిఫ్ కోర్ట్ ఎదుట న్యాయవాదులు నినాదాలతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ..న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమల్లోకి తీసుక రావాలని, ఈ నెల 8న బార్ అసోసియేషన్ అధ్యక్షులైన తౌటం సతీష్ పై తప్పుడు కేసు నమోదు చేయటంతో పాటు న్యాయవాదులపై కోర్టు ప్రాంగణంలో దూషించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్య దర్శి జవ్వాజి శ్రీనివాస్, నాయకులు గోసిక ప్రకాష్, రామటెంకి శ్రీనివాస్, పులిపాక ప్రవీణ్, మహేందర్, భాను కృష్ణ, వరలక్ష్మి, సంతోష్ తో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు చందాల శైలజ, సంజయ్ కుమార్, దుండే మల్లేష్ ,ఎరుకల ప్రదీప్, సిరిమల్ల అవినాష్, అనిల్, గోలి తిరుపతి రావు, అసంపల్లి రవీందర్, షానవాజ్ ఖాన్, పెట్టెం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.