Palakurthi | కన్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఘనంగా ధరిత్రి దినోత్సవమ్
న్నాల ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
పాలకుర్తి : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అవర్ పవర్-అవర్ ప్లానెట్” ప్రధాన అంశంగా 56వ ‘ఎర్త్ డే’ వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖనం, వర్డ్ ఫజిల్ పోటీలతో పాటు మొక్కలు నాటడం, మానవ హారం నిర్వహించారు. విద్యార్థుల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధం, మొక్కలు నాటి సంరక్షించడం, జల ఇంధన వనరులను పొదుపుగా వాడడం లాంటి విషయాలపై పూర్వ సైన్స్ అధికారి బి.రవినందన్ రావు అవగాహన కల్పించారు.
పోటీల్లో విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జే.కమలాకర్ రావు జ్ఞాపికలతో పాటు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు జి.విఠల్, ఎ.రాజయ్య, ఇ.జ్యోతి, వి.శ్రీనివాస్, కుమార్, సతీష్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

