కోల్ సిటీ, మార్చి 25: గోదావరిఖనికి చెందిన మహిళా నాయకురాలు, సామాజిక కార్యకర్త తూమ్ పద్మ గద్దర్ ఆవార్డుకు ఎంపికైంది. హైదరాబాద్లో జరిగిన లఘు చిత్రాల పోటీల సందర్భంగా ఇటీవల కరీంనగర్ లో హనుమంతు నిర్మాణంలో డైరెక్టర్ రాజీవ్ ఆధ్వర్యంలో నిర్మించిన ‘తల్లిదండ్రుల ఆత్మగౌరవం’ అనే లఘు చిత్రానపికి విశేష ఆదరణ లభించింది. ఆ లఘు చిత్రంలో తల్లి పాత్రలో నటించిన తూమ్ పద్మను గద్దర్ అవార్డుకు ఎంపిక చేసిన సందర్భంగా బుధవారం గోదావరిఖనిలో జయహో మహిళా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సన్మానించారు.
ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు జక్కని శ్రీలత నేత మాట్లాడుతూ తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణంగా ఉందన్నారు. సందేశాత్మక చిత్రాలే సమాజంలో మార్పు తీసుకవస్తాయని పేర్కొన్నారు. మున్ముందు చిత్ర పరిశ్రమలో సైతం అవకాశాలతో రాణించి ఈ ప్రాంతంకు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో దయానంద్ గాంధీ. దామెర శంకర్, కొమ్ము కుమార్, గురుమూర్తి, విజయ్, సర్వేశ్, శంకర్, నాగభూషణం, శంకర్ లింగం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.