Collector Koya Sri Harsha | రామగిరి , ఏప్రిల్ 22 : యాసంగి పంటలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. ఇవాళ కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగిరి మండలంలోని బేగంపేట, నవాబ్ పేట, కల్వచర్ల గ్రామాలలో ఐకేపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ రెవెన్యూ వేణు తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తప్పనిసరిగా ప్యాడీ క్లీనర్ ఏర్పాటు చేయాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని శుభ్రం చేసిన తర్వాత తేమ శాతం రాగానే కొనుగోలు చేయాలని, రెగ్యులర్గా ధాన్యం తేమ శాతం పరిశీలించాలని అన్నారు. రైస్ మిల్లులకు నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే సరఫరా చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలని, ప్యాడీ క్లీనర్, టార్ఫాలిన్ కవర్లు, వెయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు మొదలైన సామాగ్రి అందుబాటులో పెట్టుకొవాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలు పరిశీలించి, భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంథని ఆర్డీవో సురేష్, తహసీల్దార్ సుమన్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Drinking Water | మిషన్ భగీరథపై అధికారుల నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపు కరువు
Kollapur Mangos | కొల్లాపూర్ మామిడి రైతులను ఆదుకోవాలి : బీఆర్ఎస్ నాయకులు అభిలాష్ రావు
Rayapol ZPHS | విద్యా వెలుగులకు నెలవై.. రాయపోల్ పెద్ద బడికి నేటికి 60 వసంతాలు