కోల్ సిటీ, నవంబర్ 11: గురు షాటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో వరంగల్లో జరిగిన జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్-2025లో గోదావరిఖనికి చెందిన కరాటే క్రీడాకారులు గోల్డ్ మెడల్స్ సాధించారు. స్థానిక డ్రాగన్ షాటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు జయ సాయి చరణ్, సాయి వైష్ణవి పాల్గొని తమ ప్రతిభతో బంగారు పతకాలు కైవసం చేసుకున్నట్లు క్లబ్ వ్యవస్థాపకుడు పసునూటి చందు తెలిపారు. సీనియర్ బాలుర బ్రౌన్ బెల్ట్ స్సారింగ్, కటా విభాగంలో టింకు, జయసాయి చరణ్ లు బంగారు పతకాలు సాధించారు.
అలాగే జూనియర్, సబ్ జూనియర్ కటా స్పారింగ్ విభాగాల్లో పసునూటి రియాన్స్, ఆయన్ష్ టింగు, సాయి వైష్ణవి, వాసికర్, గాదర్ల సహస్ర, భవాని, స్పందన, తాన్వి కృష్ణ, ఎండీ రేహాన్, ఎండీ జైన్, స్మితేష్, సుహిరా అన్హా, ఆనన్య, సాయి రోషన్, అక్షయ్, అభిషేక్, సాత్విక్ నందన్, భార్గవ రాము, రోనిత్ కుమార్, నందిని రాజు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. అలాగే ఓవరాల్ గ్రాండ్ చాంపియన్ షిప్ ను సైతం కైవసం చేసుకున్నట్లు తెలిపారు. విజేతలను డబ్ల్యుఎఫ్ఎస్ఓ తెలంగాణ చీప్ చంద్రశేఖర్ ప్రత్యేకంగా అభినందించారు.