Coal City | అట్టహాసంగా గోదావరిఖని శతాబ్ది సంస్థాపన వేడుకలు..!
కోల్ సిటీ, జూన్ 23: రామగుండం లయన్స్ క్లబ్‌కు అనుబంధమైన గోదావరిఖని శతాబ్ది సంస్థాపన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. క్లబ్ గవర్నర్ హనుమాండ్ల రాజిరెడ్డి ముఖ్యతిథిగా హాజరై క్లబ్ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు.
కోల్ సిటీ, జూన్ 23: రామగుండం లయన్స్ క్లబ్‌కు అనుబంధమైన గోదావరిఖని శతాబ్ది సంస్థాపన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320 జీ ఆధ్వర్యంలో క్లబ్ నూతన అధ్యక్షుడిగా మాచీడి మహేందర్ గౌడ్, కార్యదర్శిగా పైడా సాయికుమార్, కోశాధికారిగా కొండ శ్రీకాంత్ గౌడ్లు ప్రమాణ స్వీకారం చేశారు. క్లబ్ గవర్నర్ హనుమాండ్ల రాజిరెడ్డి ముఖ్యతిథిగా హాజరై క్లబ్ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు.
సమాజ సేవలో అంకితభావంతో పని చేస్తూ లయన్స్ క్లబ్‌కు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని క్లబ్ గవర్నర్ హనుమాండ్ల రాజిరెడ్డి ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో సంస్థాపన అధికారిగా డా.విజయ, మేడిశెట్టి గంగాధర్ వ్యవహరించారు.

విశిష్ట అతిథులుగా హాజరైన జోన్ చైర్మన్, ప్రతినిధులు తానిపర్తి విజయలక్ష్మీ, పీ. మల్లికార్జున్, కజంపురం రాజేందర్, సోమారపు లావణ్యలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రాజేశ్వర రావు, చంద్రమౌళి, అమరేశ్వర రావు, బుచ్చిరెడ్డి, శ్రీనివాస రెడ్డి, గోపాల్ రెడ్డి, రాజిరెడ్డి, సాయికృష్ణ, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

