కోల్‌సిటీ : వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన మంగళవారం గోదావరిఖని నగరంలోని వివిధ ప్రాంతాల్లోగల వినాయక మండపాల్లో అన్నదానాలు, కుంకుమార్చనలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణనాధుల సన్నిధిలో పలు ప్రత్యేక పూజలు చేసి నైవేధ్యాలు సమర్పించారు. నగరంలోని 29వ డివిజన్ సూర్యనగర్ గణపతి సన్నిధిలో మునిగంటి శ్రావణి రమేష్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి హాజరై స్వామివారి వద్ద కొబ్బరికాయలు కొట్టి అన్నదానం ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాద వితరణ స్వీకరించారు. ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు వేణుగోపాల్, తిరుపతి, రమేష్, నరేష్, జానీ, సురేష్, రాజు, సంపత్, నర్సింగ్, కుమార్, విగ్రహదాత శాతరాజు వేణుగోపాల్, లావణ్య, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే 50వ డివిజన్ జవహర్‌నగర్‌లో భారత్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం నిర్వహించారు.
25 ఏళ్లయిన సందర్భంగా ఉత్సవాలకు సహకరించిన పలువురిని శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు బహూకరించారు. నిర్వాహకులు బోయిని అశోక్, రాజ్ కుమార్, రవీందర్, తిరుపతి, మొగిళి, కార్తీక్, హరీష్, మహేశ్‌తోపాటు అధిక సంఖ్యలో భక్తులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని పలు డివిజన్లలో గణపతి సన్నిధిలో కుంకుమార్చనలు, అన్నదానాలు జరగగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాంతో వినాయక మండపాలు కళకళలాడాయి.