అంతర్గం, ఫిబ్రవరి 13 : కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్(Karimnagar Medicover Hospital) ఆధ్వర్యంలో గురువారం పెద్దపల్లి జిల్లా రామగుండం కుందనపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఉద్యోగులు, సిబ్బందికి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మేనేజర్ ఆసిఫ్ అహ్మద్, సేఫ్టీ ఆఫీసర్ కృష్ణస్వామి ప్రారంభించారు. ఈ శిబిరంలో 120 మందికి హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగరాజు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, 2డి ఎకో పరీక్షలు చేపట్టి రోగనిర్ధారణ చేశారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ..ఐఓసీ ఉద్యోగులు, సిబ్బందికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. మెడికవర్ హాస్పిటల్లో 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈ శిబిరంలో ఐఓసీ ఉద్యోగులు, సిబ్బంది, దవాఖాన మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్, యూనస్ తదితరులు పాల్గొన్నారు.