Koppula Eshwar | ధర్మారం, మే 18 : రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్ రావు పేట గ్రామ వాస్తవ్యులు బీఆర్ఎస్ కార్యకర్త నస్పూరి మొండయ్య కుమారుడు అరవింద్ ను రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం పరామర్శించారు. ఇటీవల అరవింద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ గచ్చిబౌలి లోని కేర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఈశ్వర్ ఆ దవఖానకు వెళ్లి బాధితుడు అరవింద్ ను పరామర్శించి డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సదరు యువకుడు త్వరగా కోలుకోవాలని ఈశ్వర్ ఆకాంక్షించారు.