పెద్దపల్లి రూరల్ , డిసెంబర్-15 : సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసమే లీగల్ ఎయిడ్ క్లినిక్ (Leagal Aid Clinic)లను ప్రారంభించామని పెద్ద జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల (Justice Sunitha Kunchala) అన్నారు. కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలోని జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సోమవారం లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను సంబంధిత అధికారులతో కలిసి సునీత ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ.. జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ పెద్దపల్లి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ఏర్పాటు చేశాం. ప్రతి సోమవారం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో ప్యానల్ న్యాయవాదులు ఎస్.అశోక్ కుమార్, లీగల్ వాలంటరీ ఎస్.మల్లేష్ అందుబాటులో ఉంటారు. పిల్లలతో సమస్యలు ఎదుర్కొంటున్న వృద్ధ తల్లిదండ్రులు ఇక్కడ ఫిర్యాదులు చేయవచ్చు అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణు గోపాల్ రావు, ఎఫ్ఆర్ఓ స్వర్ణలత, న్యాయ సేవ ప్రాధిక సంస్థ అధికారులు శేఖర్, అశోక్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.