సుల్తానాబాద్ రూరల్ మార్చి 10 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష పాడ్స్ ,(Exam pads) పెన్నులను అందజేశారు. సుల్తానాబాద్ మండలంలోని తొగర్రాయి, కనుకుల, రేగడి మద్దికుంట గ్రామాలలోని జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్ సోమవారం పరీక్ష ప్యాడ్స్ పెన్నులను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య హాజరై మాట్లాడారు.
యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారని అందులో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులు అంటేనే నిరుపేద విద్యార్థులు చదువుకుంటారని వారికి ప్రోత్సాహం ఇవ్వడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మ నిశాంత్ సభ్యులు ఎలగందుల మల్లేశం, తూడి రామస్వామి, రమేష్, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు లింగయ్య , రాధ స్వామి, ఉమ రాణి, శ్రీగిరి తిరుపతి, శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్ తదిరులు పాల్గొన్నారు.