పెద్దపల్లి రూరల్ : త్వరలో జరుగనున్న పదవతరగతి పరీక్షల్లో పెద్దబొంకూర్ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు కష్టపడి చదివి పెద్దపల్లి జిల్లా మండలంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా ప్రత్యేక కృషి చేయాలని జిల్లా విద్యాధికారి మాధవి(DEO Madhavi) అన్నారు. పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం అకస్మికంగా సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా డీఈవో ఉపాధ్యాయులను, విద్యార్థులను వేర్వేరు కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి విద్యార్థులను మరింత నిష్ణాతులుగా తయారు చేసేందుకు స్లిప్ టెస్ట్ లు పదే పదే నిర్వహిస్తూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమం హెచ్ ఎం సుదర్శన్ , ఉపాధ్యాయులు మమత, సౌమ్య, వెంకటరమణ, శంకరయ్య, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.