 
                                                            ఓదెల, అక్టోబర్ 31: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో పోత్కపల్లి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 2కే రన్ కార్యక్రమాన్ని ఎస్సై దీకొండ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని చేశారు. రాష్ట్రీయ ఏక్తా దివాస్ 2025 లో భాగంగా 2కె రన్ పోగ్రామ్ ను చేపట్టారు. ఓదెలలోని జగదాంబ సెంటర్ నుండి ఓర్ర గడ్డ వరకు రన్నింగ్ పోటీలను నిర్వహించారు.
మండలంలోని పలు గ్రామాల యువకులు, ప్రైవేట్ వైద్యులు, స్వచ్ఛంద కార్యక్రమాల వారు దాదాపు 150 మంది పాల్గొన్నారు. వారందరికీ పోత్కాపల్లి పోలీసులు ముద్రించిన 2కే రన్ టీ షర్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బారెడ్డి మాట్లాడుతూ యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా సన్మార్గంలో ముందుకు సాగాలని కోరారు. సామాజిక సేవా కార్యక్రమాలు యువత ముందుండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడితే జీవితంతో పాటు, కుటుంబం నాశనం అవుతుందని వివరించారు.
సమాజ హితానికి పోలీసులతో యువకులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం 2కె రన్ పోటీలో విజేతలకు ట్రోఫీలను అందజేసి అభినందించారు. పోలీసులు మంచి వారితో ప్రేమగా ఉంటామని, చెడువారితో కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ ఎంపీటీసీ బోడగుంట చిన్నస్వామి, అల్లం సతీష్, గుగులోతు నిమ్మ నాయక్, ప్రైవేటు వైద్యులు కనికి రెడ్డి సతీష్, మెరుగు భీష్మాచారి, ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, ఎండి సర్వర్, పోత్కపల్లి పోలీసు సిబ్బంది తదితరులు తదితరులు పాల్గొన్నారు.
 
                            