పాలకుర్తి : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాల తక్కళ్లపల్లి గ్రామంలోని జేమ్స్ మోడల్ స్కూల్ ఆవరణలో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఆరోగ్యానికి సంబంధించిన పలు రకాల పోషకాలను ఇచ్చే వంటలు గురించి విద్యార్థులకు వివరించారు.
తెలంగాణ రుచులతో చిన్నారులు క్యారెట్ హల్వా, రాగి జావా, అంబలి, జొన్న రొట్టె, గవ్వలు, రవ్వ లడ్డు, పల్లి బట్టి, అరిసెలు, నువ్వుల లడ్డు, సర్వపిండి, పులిహోర, ఆలు బిర్యాని, డ్రై ఫ్రూట్స్ లడ్డు 70 రకాల వంటకాలను ప్రదర్శించారు . కార్యక్రమంలో కరస్పాండెంట్స్ జాలపల్లి మహేష్, ప్రధానోపాధ్యాయురాలు జాలపల్లి స్వప్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.