Ramagundam Power Station | జ్యోతినగర్(రామగుండం), జనవరి 1: రామగుండంలోని బీ థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్(1535) 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ అవిష్కరణ 1535 యూనియన్ రాష్ట్ర, రీజినల్ నాయకులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ మేరకు గురువారం రామగుండంలోని స్థానిక థర్మల్ విద్యుత్ కేంద్రం పరిపాలన భవన్ లో బీ థర్మల్ విద్యుత్ కేంద్రం ఆపరేషన్ అండ్ మెయింటెన్సీ డివిజనల్ ఇంజినీర్ కే శ్రీనివాసరావు, స్టోర్సు డివిజనల్ ఇంజినీర్ టీ కృష్ణమూర్తి, సివిల్ ఇఇ జీ సూర్యనారాయణ రెడ్డి, సివిల్ ఏఇఇ శశికాంత్ సింగ్ , సిహెచ్ అనిల్ కుమార్ లు అతిథులుగా పాల్గొని క్యాలెండర్ ను అవిష్కరించారు.
ఇక్కడ 1535 యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జీ కుమారస్వామి, ఉపాధ్యాక్షుడు అబ్దుల్ తఖీ, రీజనల్ అధ్యక్షుడు అబ్దుల్ నజ్మి, నాయకులు ఎండీ మోయిజ్ పాష, ఎస్ డి సమియొద్దీన్, డీ మురళిమోహన్, ఏ దుర్గయ్య, ఎస్ఓ బదరొద్దీన్, ఎండీ నయింపాష, ఎం డీ రహీం, ఎస్ చక్రవర్తి, జీ అంజదాఖాన్, అన్వర్ హుస్సేన్, నయిపాష, ఆసిఫ్, కృష్ణ, రమేశ్, ఆర్ఎం గ్యాణ శేఖర్ ఉన్నారు.