పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నేతల నిర్బంధాలు కొనసాగుతున్నాయి. రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కార్మిక సంఘాల నేత కౌశిక హరిని (Kaushika Hari) పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ యాష్ పాండ్‌లో జరుగుతున్న అవినీతి అక్రమాలను పరిశీలించేందుకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రామగుండం ఎమ్మెల్యే అక్రమాలను ఇటీవల ప్రెస్మీట్లో ప్రశ్నించారు. ఎన్టీపీసీ బూడిద స్థానిక ఎమ్మెల్యే, మంత్రులకు, ముఖ్యమంత్రికి కాసులు కురిపిస్తుందని విమర్శించారు. ఎన్టీపీసీ యాష్ పాండ్‌ను సందర్శించి అక్కడే నిజాలను నిగ్గు తెలుస్తానని ప్రకటించడంతో ఆయనను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.
రామగుండం ప్రాంత లారీ ఓనర్లు, డ్రైవర్లకు ప్రయోజనం కలిగిన తర్వాతే లైన్ బండ్లకు అనుమతించాలని డిమాండ్ చేశారు. బూడిద లోడింగ్ పేరుతో చేస్తున్న వసూళ్లను నిలిపివేయాలని, ఎన్టీపీసీ నేనిర్గా లారీల్లో లోడింగ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఓవర్ లోడ్ లేకుండా రామగుండం ప్రాంత లారీలతోనే బూడిద రవాణా చేపట్టాలని డిమాండ్ చేశారు.