పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 30: పెద్దపల్లి మండలంలోని సబ్బితంలో పోచమ్మ దేవతల కొలుపు భోనాల (Bonalu) పండుగను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల పెద్దమనుషుల నిర్ణయంతో పాడి పంటలు, పశు సంపద, గ్రామంలో ప్రజలంతా బాగుండాలనే సంకల్పంతో పోచమ్మ బోనాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిల్లిపాది మహిళలలు ఇంటికో భోనంతో పంబాల పూజారుల నృత్యాలు డప్పు చప్పుళ్లతో పోచమ్మ తల్లి దేవాలయానికి చేరుకుని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పోచమ్మ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గురువారం మధ్యాహ్నం బలి కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం దేవతను వెళ్లనంపు కార్యక్రమంతో పోచమ్మతల్లి కొలుపు ముగియనున్నది. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు, కులసంఘాల పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.